Saturday, August 29, 2026
Homeఎడిటోరియల్తుక్కోజీవాడిలో ఘనంగా వన మహోత్సవం

తుక్కోజీవాడిలో ఘనంగా వన మహోత్సవం

📰 Generate e-Paper Clip

తుక్కోజీవాడిలో ఘనంగా వన మహోత్సవం

నమస్తే ఇందూర్తు/ తుక్కోజీవాడి: గ్రామంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తుక్కోజీవాడి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ హాజరై మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని క్రమం తప్పకుండా సంరక్షించినప్పుడే వన మహోత్సవం లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు.గ్రామ సర్పంచ్ సంగరావు, ఉపసర్పంచ్ రాజయ్య, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!