Author: Medhudula Kashagoud

కార్యకర్తను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ నమస్తే ఇందూర్,ఎల్లారెడ్డి అక్టోబర్ 20 ఎల్లారెడ్డి మండల సాతెల్లి గ్రామ బిఆర్ఎస్ కార్యకర్త పసుపుల దుర్గయ్య సతీమణి పసుపుల పద్మ చెరువులో పడి ప్రమాదవశాత్తు మరణించారు. ఈ విషయం స్థానికులచే సమాచారం అందిన వెంటనే పండగను సైతం లెక్కచేయకుండా బాధలో ఉన్న కార్యకర్త ను ఓదార్చాడానికి ఆ గ్రామానికి చేరుకొని అంత్యక్రియలో పాల్గొన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ శోకసంద్రంలో మునిగిన ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, అండగా తానున్నానని భరోసా ఇచ్చారు.మాజీ ఎమ్మెల్యే వెంట మండల బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.తెలియని నంబర్ల నుంచి మెసేజ్‌లకు లిమిట్.. నమస్తే ఇందూర్, డెస్క్ స్పామ్ మెసేజ్‌లను అరికట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ తెలియని నంబర్లకు మెసేజ్‌లు పంపడంపై నెలవారీ పరిమితి రిప్లై ఇవ్వని వారికి పంపే మెసేజ్‌లకే ఈ నిబంధన వర్తింపు ఫ్రెండ్స్, ఫ్యామిలీ చాట్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ కొత్త అప్‌డేట్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు అనవసరమైన స్పామ్ సందేశాల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. కాంటాక్ట్ లిస్టులో లేని, పంపిన మెసేజ్‌లకు స్పందించని నంబర్లకు సందేశాలు పంపడంపై నెలవారీ పరిమితి విధించే కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం పరీక్షిస్తోంది. ఈ చర్యతో యూజర్ల ఇన్‌బాక్స్‌ను ప్రశాంతంగా, క్లీన్‌గా ఉంచాలని, వ్యక్తిగత సంభాషణలకు పెద్దపీట వేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కొన్నేళ్లుగా వాట్సాప్ కేవలం చాటింగ్ యాప్‌గానే కాకుండా కమ్యూనిటీలు, బిజినెస్ అకౌంట్లు, కస్టమర్ సర్వీస్…

Read More