Author: rayala polayya

పాల్వంచ సొసైటీ ద్వారా 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు -సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29 పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా మండలం పరిధిలో 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి,ప్రభుత్వ మద్దతు ధరకు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయనున్నామని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.పాల్వంచ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు,వ్యవసాయ శాఖ అధికారుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కొత్వాలమాట్లాడుతూ మండల పరిధిలోని రెడ్డిగూడెం(ప్రభాత్ నగర్),కారేగట్టు,సోముల గూడెం, నాగారం,మున్సిపాలిటీ పరిధిలోని పేటచెరువుప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని అన్నారు.ఈ సంవత్సరం వరి ధాన్యం సాధారణ రకం 2,369రూ//,ఏ గ్రేడ్ రకం 2,389రూ//ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించింది అన్నారు.సన్నరకం దాన్యానికి క్వింటాలకు 500రూ//బోనస్ ఇవ్వనున్నామని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొత్వాలఅన్నారు.…

Read More

నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ రాయల పోలయ్య  మెంథా తుఫాను నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్  ఆదేశాల మేరకు డిడిఆర్ఎఫ్ సిబ్బంది అశ్వరావుపేటలో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్నటి నుండి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగిపోయే ప్రాంతాలను డి డి ఆర్ ఎఫ్ సిబ్బందితో అశ్వరావుపేట సిఐ పి నాగరాజు , ఎస్సై టి యయాతి రాజు మరియు సిబ్బంది పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ తుఫాన్ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించవలసిందిగా సూచనలు చేశారు. మరియు ఎటువంటి అవసరమైన వెంటనే పోలీసు ల కు సమాచారం అందించవలసిందిగా సూచించారు.

Read More