Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ప్రెస్ అకాడమిక్ చైర్మన్గా నియమితులు అయినందుకు జర్నలిస్టుల సంబరాలు
- శివాలయ విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్.
- మెదక్ జిల్లా కలెక్టర్కు ఆరు నెలల జైలు శి
- నైతిక విజయం కాంగ్రెస్ దే – నీలం మధు ముదిరాజ్
- వట్పల్లి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దర్గా ఏ హాజ్రత్ సయ్యద్ షా ఖ్వాజ దాస్ షరీప్ 40వ వార్షిక ఆరాధన మహోత్సవం లో పాల్గొన్న మంత్రి
- జోగిపేట ఎస్ ఐ పాండుగౌడ్ కు స్వల్ప గాయాలు
- కోహీర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్కు కైవాసం.
- శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
Author: Matta Sabitha
మున్సిపల్ ఎన్నికల పై ముందస్తు సమావేశం. :- కమిషనర్ రవీందర్ సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందూర్ / జనవరి 5/ ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ రిపోర్టర్ నాగరాజు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మునిసిపల్ సాధారణ ఎన్నికల నిర్వహణ కొరకు సోమవారం నాడు అందోల్ జోగిపేట మున్సిపల్ ఆఫీస్ లో ముందస్తు సమావేశం కమిషనర్ రవీందర్ నిర్వహించారు. ఓటరు డ్రాఫ్ట్ రోల్ ను మునిసిపల్ కార్యాలయములో విడుదల చేశారు. ఈ జాబితాలను తేదీ 05.01.2026 వరకు అభ్యతరాలను స్వీకరించుటకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నాడు మునిసిపల్ పరిధి లోని గుర్తింపు పొందిన రాజకీయ ప్రజా ప్రతినిధులతో సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సమా వేశానికి వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.
కుంఫులో విజయం సాధించిన అందోల్ విద్యార్థులు. హర్షం వ్యక్తం చేసిన మాస్టర్ మురళి అందోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కుంఫులో 11 మంది బెల్ట్ సర్టిఫికెట్లను సాధించారు సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందుర్/ జనవరి 5/ ఆందోల్ నియోజవర్గం రిపోర్టర్ నాగరాజు అందోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కుంఫులో విజయం సాధించారు. వారియర్ మార్చర్ ఆర్ట్స్ వంటి యుద్ధ క్రీడల్లో అమ్మాయిలు రాణించడంలో ఆత్మ స్థైర్యాన్ని తోపాటు జీవితంలో ఉన్నత విజయాలు సాధించాలని ప్రధానోపాధ్యాయులు దేవిదాస్ అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన మార్చల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియా రాష్ట్రస్థాయి బెల్ట్ ఎగ్జామ్ లో అందోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు బెల్టు సర్టిఫికెట్ సాధించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మురళి, పిటి కృష్ణ, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
బిచ్కుంద మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి జుక్కల్ ప్రతినిధి నమస్తే ఇందూర్, న్యూస్ తెలుగు దినపత్రిక,03, జనవరి బిచ్కుంద భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించరు. బిజెపి బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షులు శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ… సావిత్రిబాయి పూలే జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు మహిళలు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పుడే ఆమెకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార, బిచ్కుంద మండల జనరల్ సెక్రటరీలు జాదవ్ పండరి, పిరజీ, గంగరాజు, లక్ష్మణ్ చారి, గోపాల్ చారి, పస్కే ప్రకాష్, శ్రీకాంత్, మోహన్ దేశాయ్, పండరి, మారుతి, అంజయ్య, మల్లికార్జున్, మల్లు దేశాయ్, దన్నురు విట్టల్, దయానంద్, సంతోష్ స్వామి, తదితరులు పాల్గొన్నారు
పంట కొనుగోళ్లు, రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రసంగించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జుక్కల్ ప్రతినిధి నమస్తే ఇందూర్, న్యూస్ దినపత్రిక, 03, జనవరి రాష్ట్రంలోనే అత్యధికంగా సోయా పంట పండించే జుక్కల్ నియోజకవర్గంలోని రైతుల సమస్యలు, పంట కొనుగోలు సమయంలో తలెత్తుతున్న ఇబ్బందులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసే విధంగా కొనుగోళ్లకు సంబందించి ఒక కొత్త పాలసీని తీసుకురావాలని కోరారు.. బిచ్కుంద ప్రాంతంలో సోయా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని, బిచ్కుందలో సోయా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు..
బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బిజెపి పార్టీ సమావేశజుక్కల్ ప్రతినిధి నమస్తే ఇందూర్, న్యూస్ తెలుగు దినపత్రిక, 03 జనవరి,బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా శనివారం రోజున బిచ్కుంద బిజెపి పార్టీ కార్యాలయంలోబిజెపి మండల పార్టీ అధ్యక్షులు శెట్పల్లి విష్ణు ఆధ్వర్యంలోమున్సిపాలిటీ బిజెపి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో అత్యంత కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూరాబోయే మున్సిపాలిటీ ఎన్నికలో బిజెపి పార్టీకి ఎంతో కీలకమని,ప్రతి వార్డు లో బిజెపి పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఇంటింటికీ తీసుకెళ్లి,బిజెపి పార్టీనే ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని తెలియజేయాలని సూచించారు.ఎన్నికల సమయంలో ఎలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు లోనుకాకుండాపార్టీ శ్రేణులు ఐక్యంగా, క్రమశిక్షణతో ముందుకు సాగాలని…
కామారెడ్డిలో వేపిల్ వైస్ స్నాక్స్ షాప్ ఓపినింగ్ _మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రామ్మోహన్ నమస్తే ఇందూర్. కంబ్లె మధుకర్. బోధన్ ప్రతినిధి. 3 జనవరి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చ్ గ్రౌండ్ లో వేఫిల్ వైస్ స్నాక్స్ షాప్ మాజీ కౌన్సిలర్ రామ్మోహన్ శనివారం ప్రారంభించారు.కొత్త రకం రుచిని కోరుకునే జిల్లా ప్రజలకి కొత్తగా రుచికరమైన వివిధ రూపాల్లో,చిన్న పిల్లలకి వివిధ రకాల చాకోలెట్ ఫ్లేవర్ తో షాప్ ని ప్రారంభించారు. డార్క్ ఫాంటసీ, మిల్క్ ఫాంటసి, వెయిట్ ఫాంటసీ, డార్క్ & మిల్క్, డార్క్ & వైట్, కార్మెల్ చాక్లెట్, ట్రిపుల్ చాక్లెట్, క్రంచీ ఓరియో, క్రంచీ కిట్ క్యాట్, జేమ్స్ విత్ మిల్క్, జేమ్స్ విత్ డార్క్ వంటి తినే ఆహార పదార్థాలు దొరుకుతాయని అన్నారు.
మునిపల్లి: ‘పిల్లల గొడవ.. పెద్దల ఘర్ష సంగారెడ్డి జిల్లా/మునిపల్లి మండలం/నమస్తే ఇందూర్/జనవరి 1. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నూతన సంవత్సర వేడుకల్లో చోటుచేసుకున్న చిన్నపిల్లల గొడవ కాస్తా పెద్దల మధ్య ఘర్షణకు దారితీసిం gvది. మునిపల్లి మండలం మల్లికార్జునపల్లిలో అర్ధరాత్రి ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో పాండు (40) తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ సందర్భంగా కిరాణా షాపు లో మద్యం సీజ్ కేసు నమోదు అచ్చంపేట తాలూకా పరిధిలోని సంఘటన నమస్తే ఇందూర్, రిపోర్టర్ పంబ శంకర్ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట తాలూకా పరిధిలో లింగాల గ్రామంలో ఉన్న కొనేటి వెంకటస్వామి నడిపిస్తున్నా జనరల్ కిరాణా షాపు పై పోలీసులు సడెన్ రైడ్ నిర్వహించి అనధికార మద్యం సీజ్ చేశారు. స్టేషన్ కి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ ఆధ్వర్యంలో దాడి చేయగా, షాపు లో వివిధ బ్రాండ్ లకు చెందిన మద్యం సిసాలను అనమతి లేకుండా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అందాజా రుపాయలు 5000/- విలువ కలిగిన మద్యం ను స్వాధీనం చేసుకుని సంబందిత యజమాని కొనేటి వెంకటస్వామి ని అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ఎన్నికల సందర్భంగా మద్యం, బీరు లాంటి మద్యం అక్రమ రవాణా, నిల్వలను…
స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగిన బంజారా ఆడబిడ్డ దశాబ్ద కాలం నుంచి వార్డు మెంబర్ నమస్తే ఇందూర్, అమ్రాబాద్ మండల రిపోర్టర్ జి.సరిత నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట ( బ్రహ్మగిరి ) గ్రామ పంచాయతీ నుండి మనకు తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటు అయినప్పటినుంచి ఇప్పటి వరకు అంటే దశాబ్ద కాలం నుంచి వార్డు మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రామావత్ సుశీల ఈ సారి స్థానిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆనుకుంది. కాని తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన BRS పార్టీ మీద ఉన్న అభిమానం తో మరియు కటకం మహేష్ మాజీ ఉప సర్పంచ్ మరియు ఎడ్ల శేఖర్, తిమ్మన్న ( BRS సీనియర్ నాయకులు ) మాట కాదనకుండా మళ్లీ BRS పార్టీ తరుపున 9 వ వార్డు మెంబర్ అభ్యర్థి గా ఆఖరి రోజు నామినేషన్ వేసి దోమలపెంట (…
గుడి బడి ఏవి ఉన్నా పర్వాలేదు మా మాయాజాలంతో 100 మీటర్లు చూపిస్తాం ఎక్సైజ్ అధికారుల తీరిది పార్కింగ్ స్థలం లేక పూర్తిగా రోడ్డుపైనే నిలుస్తున్న వాహనాలు అయినా సరే అభ్యంతరం లేదు సింగరేణి పదవీ విరమణ పొందిన కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో తగ్గిన జనాభా రామగుండం కార్పొరేషన్ పరిధిలో మూడు వైన్ షాపులను హైదరాబాదుకు తరలించడం జరిగింది కాలనీవాసులు ఎక్సైజ్ అధికారులకు ఎన్ని వినతి పత్రాలు సమర్పించిన ఫలితం శూన్యం క్లస్టర్ విధానంలో మార్కండేయ కాలనీ నుండి మొదలుకొని 8 వ కాలనీ వరకు షాపులను ఎక్కడైనా పెట్టుకునే అవకాశం ఉన్నా నమస్తే ఇందూర్ రామగుండం 8 వ కాలనీ ప్రతినిధి 9/11/2025 ఆదివారం స్థానిక 8వ కాలనీ హనుమాన్ నగర్ వాటర్ ట్యాంక్ చౌరస్తాలో గల గెజిట్ నెంబర్ 56 వైన్ షాపు గుడి,బడికి అత్యంత సమీపంలో ఉన్న అవినీతి అధికారుల మూలంగా పాఠశాల పర్మిషన్ ఇక్కడ…










