సింగూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో నుండి
అగ్నివీర్ గా ఎంపికైన సింగూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థి
శివ కుమార్. సంగారెడ్డి జిల్లా/ఇల్కల్ మండలం/నమస్తే ఇందూర్/నవంబర్ 19. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్.
హనుమకొండలో జరిగిన ఆర్మీ ర్యాలీలో సింగూర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో చదువుతున్న శివకుమార్ అనే విద్యార్థి అగ్ని వీర్ గా ఎంపికయ్యాడు. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఆర్మీకి ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపల్ ఆగమయ్య, క్రీడల్లో తీర్చిదిద్దిన PD కృష్ణ, ఉపాధ్యాయ బృందం సంతోషం వ్యక్తం చేసి విద్యార్థిని అభినందించారు.
69వ SGF రాష్ట్రస్థాయిలో….
సత్తా చాటిన సింగూర్ గురుకులం
11వ జోనల్ స్పోర్ట్స్ మీట్లోనూ
ఓవరాల్ ఛాంపియన్ సింగూరే.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో సింగూరు గురుకులం విద్యార్థులు సత్తా చాటారు. యాదాద్రి భువనగిరిలో జరిగిన వాలీబాల్ అండర్ 19 విభాగంలో అజయ్ కుమార్, ప్రణయ్ లు తమ ప్రతిభను కనబర్చగా జింఖానా గ్రౌండ్లో జరిగిన అండర్ 14 అథ్లెటిక్స్ లో నితీష్, హనుమకొండలో అండర్ 17 అథ్లెటిక్స్ లో రిషి అరుణ్ వర్ధన్ తమ సత్తాను చూపించారు. అదే విధంగా రాష్ట్ర స్థాయి లో అండర్ 17 విభాగం అసోసియేషన్ క్రీడల్లోనూ మల్లేశం, రామ్ చరణ్ తమదైనా నైపుణ్యాన్ని కనబర్చారు. అదేవిధంగా సికింద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో సుమిత్, ధనుష్, నితీష్, మాణిక్యం పాల్గొన్నారు. కాగా పఠాన్ చెరువులో జరిగిన రాష్ట్ర స్థాయి ఖో ఖో జూనియర్ విభాగంలో శ్యామ్, యాదుల్, అరుణ్, ప్రశాంత్ లు తమ తమ క్రీడా ప్రతిభను చాటారు.
11వ జోనల్ స్పోర్ట్స్ మీట్లోనూ
ఓవరాల్ ఛాంపియన్ సింగూరే.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హత్నూర అంబేద్కర్ క్యాంపస్లో జరిగిన 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్లో అండర్ 19, అండర్ 17, అండర్ 14 విభాగాల్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను కూడా సింగూరు విద్యార్థులే కైవసం చేసుకున్నారు.

