ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 23 మంది గురువులకు ఘన సన్మానం
నమస్తే ఇందూర్: గీసుగొండ
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ గొర్రెకుంట ప్రైమరీ, సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు క్లెమెంట్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించగా గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, విద్యా అభిమానం కలిగిన పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 23 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాట్లాడిన క్లెమెంట్ మాదిగ మాట్లాడుతూ, “భారతదేశపు తొలి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టిన రోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఉపాధ్యాయ వృత్తి ఒక పుణ్యవృత్తి. విద్యార్థులా నిరంతరం నేర్చుకుంటూ, భవిష్యత్ తరాలను విద్యావంతులుగా తీర్చిదిద్దే వారు నిజమైన గురువులు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు ల్యాదల్ల ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ పోలేపాక సుమన్, కాంగ్రెస్ పార్టీ 15వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎలగొండ ప్రవీణ్, మాదిగ జన జాగృతి జిల్లా అధ్యక్షులు సిలువేరు రవి, జన్ను వెల్ఫేర్ అధ్యక్షులు జన్ను నరసయ్య, ల్యాదల్ల ప్రవీణ్, జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యుడు ఇరుగు జాన్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు కోయిల పద్మ (డేపోరా), వేదవతి తదితరులు పాల్గొన్నారు.

