ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదినం సందర్భంగా నోట్ పుస్తకాల పంపిణీ
నమస్తే ఇందుర్ పెబ్బేర్ జనవరి 8
వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం పెబ్బేరు మున్సిపాలిటీ పదో వార్డులోని చెంచువాడ మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్,తనయుడు యువ నాయకులు అక్కి మణిదీప్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్,పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్ మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్,రామన్ గౌడ్,భాను ప్రకాష్ రెడ్డి,రణధీర్ రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్, వినయ్,అశోక్,మనీ గౌడ్ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





