గుడి బడి ఏవి ఉన్నా పర్వాలేదు మా మాయాజాలంతో 100 మీటర్లు చూపిస్తాం ఎక్సైజ్ అధికారుల తీరిది
పార్కింగ్ స్థలం లేక పూర్తిగా రోడ్డుపైనే నిలుస్తున్న వాహనాలు అయినా సరే అభ్యంతరం లేదు
సింగరేణి పదవీ విరమణ పొందిన కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో తగ్గిన జనాభా
రామగుండం కార్పొరేషన్ పరిధిలో మూడు వైన్ షాపులను హైదరాబాదుకు తరలించడం జరిగింది
కాలనీవాసులు ఎక్సైజ్ అధికారులకు ఎన్ని వినతి పత్రాలు సమర్పించిన ఫలితం శూన్యం
క్లస్టర్ విధానంలో మార్కండేయ కాలనీ నుండి మొదలుకొని 8 వ కాలనీ వరకు షాపులను ఎక్కడైనా పెట్టుకునే అవకాశం ఉన్నా
నమస్తే ఇందూర్ రామగుండం 8 వ కాలనీ ప్రతినిధి 9/11/2025 ఆదివారం
స్థానిక 8వ కాలనీ హనుమాన్ నగర్ వాటర్ ట్యాంక్ చౌరస్తాలో గల గెజిట్ నెంబర్ 56 వైన్ షాపు గుడి,బడికి అత్యంత సమీపంలో ఉన్న అవినీతి అధికారుల మూలంగా పాఠశాల పర్మిషన్ ఇక్కడ లేనందున 100 మీటర్ల లోపు ఉన్న ముడుపులతో అనుమతులు ఇస్తున్నారు. కొత్తగా ఏర్పడిన క్లస్టర్ విధానంలో గోదావరిఖని మార్కండేయ కాలనీ దగ్గర నుండి ఎనిమిదవ కాలనీ వరకు 12 షాపులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం వున్నా. సింగరేణి కార్మికుల పదవీ విరమణ కారణంగా స్వస్థలాలకు వెళ్లిపోవడంతో జనాభా తగ్గిన కారణంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో 27 షాపులకు గాను మూడు షాపులను హైదరాబాదుకు తరలించడం జరిగింది. మిగిలిన 24 షాపులకు మాత్రమే నోటిఫికేషన్ వెలబడింది డ్రా తీసి షాపులు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎనిమిదవ కాలనీ చౌరస్తా మెయిన్ రోడ్డు లో గ ల శ్రీ శ్రీనివాస వైన్స్ గెజిట్ నం 56 (ప్రస్తుత షాప్) మళ్లీ అక్కడే ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడున్న పరిస్థితులు వైన్ షాపు ముందుగల కాలి స్థలాన్ని ఇంతకాలం పార్కింగ్ కోసం వినియోగించారు కానీ స్థల యజమాని ఇంటి నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా పార్కింగ్ గజం స్థలంకూడా లేకుండా పోయింది చుట్టూ కాలువ తీయడం వల్ల పూర్తిగా పార్కింగ్ రోడ్డు మీదనే చేస్తున్నారు. క్లస్టర్ విధానంలో 8వ కాలనీలో రెండు వైన్ షాపులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్న అంతర్గత కలహాలతో షాపు కిరాయి రావడం కోసం మళ్లీ మూడు వైన్ షాపులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక బార్ అండ్ రెస్టారెంట్ మరియు మూడు వైన్ షాపులు ఉండడం వల్ల రెండు సంవత్సరాలు కోట పూర్తి చేయడానికి విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టుకోవడానికి పర్మిట్ రూములను పెంచుకోవడానికి అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయమే కానీ ప్రజల బాగోగులు అవసరం లేదు అనే విధంగా ఎక్సైజ్ అధికారుల పనితీరు కనిపిస్తుంది. గతంలో ఒక పదవీ విరమణ చేసిన ఏసీబీ అధికారి ఎక్సైజ్ అధికారులను భయభ్రాంతులకు గురిచేసి గుడి బడి తో సంబంధం లేకుండా అధికారులు పర్మిషన్ ఇచ్చే విధంగా సహకరించాడని వినికిడి. హనుమాన్ నగర్ వాసులు ఎక్సైజ్ అధికారులకు ఎన్ని వినతి పత్రాలు సమర్పించిన ప్రయోజనం లేకుండా పోతుంది. పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా నిలదీస్తే వారిని డబ్బు మందుతో సత్కరించి పంపించి వేస్తున్నారు. గుడి బడి కి వెళ్లే మార్గంలో బార్ అండ్ రెస్టారెంట్ మరియు వైన్ షాప్ పక్కపక్కనే ఉండడం వల్ల మందుబాబుల తాకిడి ఎక్కువగా ఉంటూ కొన్ని సందర్భాలలో కత్తిపోట్లు చాలా గొడవలు జరిగినాయి. పక్కనే ఉన్న డైలీ మార్కెట్ కోసం కేటాయించిన స్థలంలో మందుబాబులు హల్చల్ చేస్తున్నారు ఇన్ని జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు గానీ పోలీసు అధికారులు గానీ షాపులను ఇక్కడ నుండి తరలించాలని ఆలోచన మాత్రం రావడం లేదు. ఇదే విషయాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారా మంత్రిగారికి విన్నవించడం జరిగిందని వారు సానుకూలంగా స్పందించినారని తగు విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు ఇప్పటికైనా అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి ఇక్కడఅనుమతులు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేనియెడల ధర్నా చేయడానికి కూడా వెనకాడబోమని హనుమాన్ నగర్ కాలనీవాసులు మహిళలు హెచ్చరించారు.





