*జూనియర్ అసిస్టెంట్ ని బెదిరించి మరీ రైతుల పై కేసులు పెట్టించిన అధికారులు..*
*ఇందూరు వార్త / నవంబర్ 13 / కోటగిరి, పొతంగల్:*
పొతంగల్ మండల కేంద్రంలోని సోమవారం 10వ తేదీ, నాడు అక్రమ ఇసుక రవాణా పై రైతులు చేసిన ధర్నాని మండల అధికారులు మనసులో పెట్టుకొని స్పాట్లో లేని జూనియర్ అసిస్టెంట్ తో బాధితులపై , అక్రమంగా కేసులు పెట్టించడం ఎంత వరకు సమంజసమని , ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం పోతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా మందిరం కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ…అనుమతుల పేరుతో అక్రమ ఇసుక రవాణా, ఓవర్ లోడ్ తో వెళ్తూ ప్రజలు ఇబందులు పడుతుంటే గ్రామస్తులు, రైతులు ఆపినందుకు అక్రమ కేసులు చేయటం ఏంటని ఆరోపించారు. పోతంగల్ మండలంలోని కోడిచెర్ల శివారులో మంజీరాలో రైతుల పొలాల్లో నుంచి ఇసుకను తీయడానికి పట్టా భూమిలో కిలోమీటర్ల దూరం రోడ్లు వేసి ట్రాక్టర్లతో మంజీరా నుంచి ఇసుక నింపి మరోచోట డప్పు చేస్తున్నారు. రాత్రి సమయంలో మద్నూర్ మహారాష్ట్ర, తో పాటు ఇతర ప్రాంతాలకు ట్రాక్టర్లలో అక్రమ ఇసుక తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంపై చాలాసార్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని రైతులు మండిపడ్డారు, అధికారులకు సమాచారాన్ని ఇచ్చిన వెంటనే ఇసుక మాఫియాదారులకు చేరవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు, గోప్యంగా ఉంచాల్సిన అధికారులే అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్నారని చెప్పుకొచ్చారు, అధికారులు అక్కడికి వచ్చేలోపే అక్కడికి వచ్చిన ట్రాక్టర్లను బయటకి పంపించడమే కాకుండా అడ్డు వచ్చిన వారిపై దౌర్జన్యంగా దాడి చేస్తున్నారని వాపోయారు. పట్టా భూమిలో పర్మిషన్ తీసుకొని పట్టాదారు పొలంలో ఇసుక అయిపోతే, ప్రభుత్వ భూమికి సంబంధించిన మంజీరాలో నుంచి రాత్రి వేళలో అక్రమంగా ఇసుక తీసుకువచ్చి మళ్లీ అదే పట్టేదారు పొలంలో డంపు చేసి అనుమతుల పేరుతో, ప్రభుత్వ ఆదాయాన్ని, గండి కొట్టి సొమ్ము చేసుకుంటున్నారని, ప్రభుత్వ సంపదను కాపాడాల్సిన అధికారులే ఇద్దరు ముగ్గురితో చేతులు కలిపి కోమ్ము కాసి ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారని అన్నారు.ఇంత జరుగుతున్న, మైనింగ్, రెవిన్యూ, పోలీస్ సంబంధిత శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని, దీనిపై అంతరాయం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం 11వ తేదీన మైనింగ్ మరియు పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు వస్తున్న సమాచారాన్ని ఇసుక మాఫియా దారులకు ఎలా తెలిసిందని, సోమవారం ఉన్న ఇసుక దిబ్బలు,మంగళవారం ఉదయం కల్లా ఇలా మాయమయ్యాయని ఆరోపించారు, మైనింగ్, రెవెన్యూ, పోలీసు,అధికారులు వచ్చి చూస్తే ఇసుక వేటలు లేవు రాత్రికి రాత్రి జెసిపి తో లేవల్ చేశారని ఆరోపించారు. మాపై అక్రమ కేసులు పెట్టినంతమాత్రాన మేము భయపడేది లేదని ప్రజల పక్షాన రైతుల పక్షాన దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఇదే విషయాన్ని మండల స్థాయిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఎవరెవరి దగ్గర ఏ ఏ అధికారికి ఎంతెంత ముడుపులు అందాయో కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పబ్బ శేఖర్ యధులు, సుధాం నవీన్, నాగేష్, గంధపు మోహన్, గంట్ల శీను, కొట్టాల గంగారం, గైని వీరు, పబ్బా అనిల్, తాజుద్దీన్, బూరుబోయిన గంగాధర్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.





