జేఎన్టీయూ విద్యార్థి ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా/చౌటకూర్ మండలం/నమస్తే ఇందూర్/అక్టోబర్ 31.
కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్.
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మం. సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.తృతీయ సంవత్సరం విద్యార్థి మహేందర్ (24) హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు క్యాంపస్ అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మహేందర్ మృతి చెందాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాలి.



