నవంబర్ 2న మండల కేంద్రంగా నాయకపోడు యువ గర్జన
నమస్తే ఇందురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29
• తప్పుడు ప్రచారాలు నమ్మోద్దు..
దమ్మపేట మండలంలో నాయకపోడు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లాధ్యక్షుడు సోమనేని శివశంకర ప్రసాద్ మాట్లాడుతూ, నవంబర్ 2న మండల కేంద్రంలో జరగనున్న “నాయకపోడు యువ గర్జన” పేరుతో జరుగుతున్న కార్యక్రమానికి రిజిస్టర్ నంబర్ 141/2015తో నమోదైన నాయకపోడు సంఘానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
కొంతమంది స్వార్థపరులు తమ స్వ ప్రయోజనాల కోసం ఇతర గిరిజన సంఘం ఆధ్వర్యంలో నాయకపోడు దేవతల ఊరేగింపు పేరుతో నాయకపోడు జాతిని మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ తప్పుడు ప్రచారాలకు భ్రమ చెందవద్దని, నాయకపోడు కుల పెద్దలు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత సంఘం ఏకతకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో కార్యదర్శి తాళదుర్గయ్య, భోగి వీరస్వామి, పూసి గోవర్ధన్, కొయ్యల అచ్యుతరావు, రావుల శ్రీనివాసరావు, అల్ల జంగం, గడ్డం వెంకటేశ్వరరావు, పాశం ప్రసాద్, కాసిన వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు రాశా శ్రీనివాసరావు, వాసం శ్రీనివాసరావు, గుల్లా రాంబాబు, యాట్ల ధర్మరాజు, మండల అధ్యక్షుడు రావుల రామకృష్ణ, కార్యదర్శి సిద్ధిని చలపతిరావు, బత్తుల సాయి, పాశం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

