పటాన్చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి కోకో క్రీడలు..
విజేతలకు బహుమతులు ఎమ్మెల్యే జిఎంఆర్
రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా పటాన్చెరు
సంగారెడ్డి జిల్లా/పటాన్చెరు మండలం/నమస్తే ఇందూర్/డిసెంబర్ 22. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్
పటాన్చెరు 
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా గత మూడు రోజులుగా జరుగుతున్న 44వ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా అండర్ 14 బాలుర బాలికల కోకో క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా ముగిసాయి.
ముగింపు వేడుకలకు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.
పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు.
రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా పటాన్చెరు నిలవబోతోందని తెలిపారు.
అనంతరం అండర్ 14 బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో, రంగారెడ్డి జిల్లా జట్టు రెండవ స్థానంలో, హైదరాబాద్ జట్టు మూడో స్థానంలో నిలిచాయి
అండర్ 14 బాలికల విభాగంలో ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో మహబూబ్నగర్ రెండవ స్థానంలో, నల్లగొండ మూడవ స్థానంలో నిలిచాయి.
క్రీడాకారుల కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో ఉచిత వసతి, భోజనం, బహుమతులు అందజేశారు.


