పాల్వంచ సొసైటీ ద్వారా 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
-సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల
నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29
పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా మండలం పరిధిలో 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి,ప్రభుత్వ మద్దతు ధరకు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయనున్నామని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.పాల్వంచ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు,వ్యవసాయ శాఖ అధికారుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కొత్వాలమాట్లాడుతూ మండల పరిధిలోని రెడ్డిగూడెం(ప్రభాత్ నగర్),కారేగట్టు,సోముల గూడెం, నాగారం,మున్సిపాలిటీ పరిధిలోని పేటచెరువుప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని అన్నారు.ఈ సంవత్సరం వరి ధాన్యం సాధారణ రకం 2,369రూ//,ఏ గ్రేడ్ రకం 2,389రూ//ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించింది అన్నారు.సన్నరకం దాన్యానికి క్వింటాలకు 500రూ//బోనస్ ఇవ్వనున్నామని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొత్వాలఅన్నారు.
పాల్వంచ సొసైటీ కార్యదర్శి లక్ష్మీనారాయణ(శ్రీను)బూర్గంపాడు సొసైటీకి బదిలీ
పాల్వంచ సొసైటీలో కార్యదర్శిగా(సీఈవో) గా పనిచేస్తున్న జి లక్ష్మీనారాయణ (శ్రీను)బూర్గంపాడు సొసైటీ కి బదిలీ అయ్యారు.పాల్వంచ నూతన కార్యదర్శిగా బత్తిన వెంకటప్రసాద్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు.ఈ సందర్భంగా కొత్వాల తో పాటు పాలకవర్గం సభ్యులు సిబ్బంది లక్ష్మీనారాయణను శాలువా బోకేలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్,డైరెక్టర్లు బుడగం రామమోహనరావు, కనగాల నారాయణరావు,చౌగాని పాపారావు,సామా జనార్ధన రెడ్డి, జరభన సీతారాం బాబు,భూక్య కిషన్,ఎర్రంశెట్టి మధుసూదన్ రావు, కార్యదర్శులు బివి ప్రసాద్,జి లక్ష్మీనారాయణ,ఏ ఈ ఓ అణురిక, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

