మనోహరబాద్ తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత…
-తప్పుడు రిజిస్టేషన్ చేశారు అంటూ ఆందోళన
పెట్రోల్ పోసుకుని చనిపోత అంటూ ఆందోనల
మనోహరాబాద్, సెప్టెంబర్ 19 ( నమస్తే ఇందూర్) మెదక్ జిల్లా మనోహరబాద్ తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత అన్యాయంగా లంచం తీసుకొని దొంగ రిజిస్టేషన్ చేసి తల్లిని రోడ్డుపాలు చేశారు.అంటూ బాధితుల ఆందోళన శనివారం,రంగంలోకి దిగినా పోలీసులు.మనోహరబాద్ మండల పరిధిలోనీ అగ్రహారం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గంగా మాధవి భర్త రాములు అనారోగ్యంతో చనిపోగా ఆమెకు కి ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు గౌరీ శంకర్ గతంలో చనిపోగా చిన్న కుమారుడు కుమార్ పని చేస్తున్న వద్ద గోడకులి చనిపోవడంతో కుమార్ పేరుమీద ఉన్న తల్లి మాధవి ప్రమేయం లేకుండా కోడలు పేరు మీద చేసాడని ఆందోళనకు దిగారు.తహసిల్దార్ వద్దకు వెళ్ళి ఆందోళన చేశారు.భర్త ఇద్దరు కుమారులు చనిపోగా ఒక్కదాన్ని అనాథగా మారాను అని శోకించారు.దీనితో తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.తహసిల్దార్ ఆంజనేయులు వివరణ కోరగా చట్ట ప్రకారం భర్త పేరు మీద ఉన్న ఆస్తిని అతను చనిపోతే భార్యకి చెందడం చట్టం కాబట్టి దీనికి ఎలాంటి వ్యతిరేకత రాలేదు కాబట్టి పలు మార్లు నోటీసులు జారీ చేసి ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో చట్టం ప్రకారం చేశానని తెలిపారు.


