మున్సిపల్ ఎన్నికల్లో పోటికి సిద్ధం కావాలి
స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే సిపిఎం పార్టీ అభ్యర్థులు గెలిపించండి
సంగారెడ్డి జిల్లా/నమస్తే ఇందూర్/జనవరి 10. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరం, మల్లేశం
మున్సిపల్ ఎన్నికల్లో పోటికి సిద్ధం కావాలని నిరంతరం ప్రజల సమస్యల మీద పోరాటం చేసే సిపిఎం పార్టీ అభ్యర్థులు గెలిపించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరం, మల్లేశం అన్నారు ఈరోజు స్థానిక సుందరయ్య భవన్లో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరం, మల్లేశం మాట్లాడుతూ* నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే సిపిఎం అని అన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేసే సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు ప్రభుత్వాలు మారుతున్న సంగారెడ్డి మాత్రం మారడం లేదని అన్నారు ఏ పార్టీ నాయకులు కూడా స్థానిక సమస్యలు పట్టించుకోవడంలేదని అన్నారు అందులో భాగంగానే సిపిఎం పార్టీ అభ్యర్థులను ఈ స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు మున్సిపల్ కౌన్సిల్లో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదని ఆయన అన్నారు సమస్యలు చర్చకు రావాలంటే సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన అన్నారు నిరంతరం ప్రజల సంక్షేమ కోసం పోరాటం చేసే సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజల కోరారు యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అవినీతి, మతోన్మాదం, కుళ్లు రాజకీయాలకు స్వస్తిపలికి నవసమాజ నిర్మాణానికి దోహ దపడుతుందన్నారు. సమస్యల పరిష్కారం కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించవలసిన అవసరం ఉందన్నారు. పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారమై మెరుగైన సమాజం నిర్మాణమవుతుందని పేర్కొన్నారు. పార్టీలు ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలుచేయడం లేదన్నారు. కమ్యూనిస్టు పార్టీ ద్వారానే మార్పు సాధ్యమవుతుం దన్నారు. ప్రజలు ఈ దిశగా ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు. సిపిఎం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు సిపిఎం పార్టీ అభ్యర్థులను ఆదరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సంగారెడ్డి ఏరియా కార్యదర్శి యాదగిరి సిపిఎం పార్టీ నాయకులు, బాలరాజు, మురళి నర్సింలు, లక్ష్మణ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు

