ePaper
Tuesday, April 14, 2026
📄 ePaper
Homeఅంతర్జాతీయంతెలంగాణలో గోరక్ష చట్టాలను కఠినంగా అమలు చేయాలి : విశ్వహిందూ పరిషత్ డిమాండ్

తెలంగాణలో గోరక్ష చట్టాలను కఠినంగా అమలు చేయాలి : విశ్వహిందూ పరిషత్ డిమాండ్

📰 Generate e-Paper Clip

తెలంగాణలో గోరక్ష చట్టాలను కఠినంగా అమలు చేయాలి : విశ్వహిందూ పరిషత్ డిమాండ్

చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి VHP బృందం వినతిపత్రం సమర్పణ

సానుకూలంగా స్పందించిన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు

 గోరక్షణకు కృషి చేస్తానని హామీ

తెలంగాణ రాష్ట్రంలో గోరక్షణ చట్టాలను మరింత కఠినంగా, సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ (VHP) ప్రతినిధి బృందం సోమవారం తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు గారిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా VHP నాయకులు మాట్లాడుతూ.. గోమాత భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆధారిత జీవన విధానానికి ప్రతీక అని పేర్కొన్నారు. గోవు కేవలం ఒక జంతువు మాత్రమే కాకుండా, భారతీయ జీవన తత్త్వంలో పూజనీయ స్థానం కలిగిన పవిత్ర ఆరాధ్యరూపం అని తెలిపారు.
ఇటీవల కాలంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గోవుల అక్రమ రవాణా, అక్రమ వధ, చట్టవిరుద్ధ మాంస రవాణా వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా గోరక్షణ చట్టాల అమలుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను నియమించాలి సరిహద్దు ప్రాంతాలు, హైవేలు, చెక్‌పోస్టుల వద్ద కఠిన తనిఖీలు చేపట్టాలిఅక్రమ వధశాలలు, అనుమతి లేని మాంస రవాణా కేంద్రాలపై తక్షణ చర్యలు తీసుకోవాలిగో వధ, అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలి గోశాలలకు ప్రభుత్వ పరిరక్షణ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సహాయం అందించాలి గోరక్షణపై పోలీసు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖల సమన్వయం పెంచాలి.. అని VHP నాయకులు చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.గోరక్షణ అనేది కేవలం మతపరమైన అంశం మాత్రమే కాకుండా, సాంస్కృతిక, ఆర్థిక, పర్యావరణ, వ్యవసాయ పరిరక్షణకు సంబంధించిన జాతీయ బాధ్యత అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం గోమాత సంరక్షణ విషయంలో మరింత చురుకైన, కఠినమైన చర్యలు తీసుకుని, చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారిపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు.సానుకూలంగా స్పందించిన చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ.. గోహత్య నిషేధ చట్టాలను కఠినంగా అమలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర నాయకులు పగుడాకుల బాలస్వామి, రమేష్ , సుభాష్ చందర్, స్వామీజీలు దుర్గానంద, సర్వేశ్వర శివయోగి అంబిక, రంగనాథ్ పాల్గొన్నారు.

భవదీయ

పగుడాకుల బాలస్వామి
ధర్మచార్య సంపర్క ప్రముక్
విశ్వహిందూ పరిషత్
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!