బాధిత కుటుంబాలకు పరామర్శ.. 50 కిలోల సన్న బియ్యం అందజేత
నమస్తే ఇందూర్ఆగస్టు 2: ఫరీద్‌పేట్ గ్రామంలో ఇటీవల మరణించిన తమ్ముడి భూపతి, చింతకింది కళావతి కుటుంబాలను గ్రామ సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ కోల బాలగౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా గ్రామ పంచాయతీ తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.అనంతరం బాధిత కుటుంబాలకు 50 కిలోల సన్న బియ్యాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తమ్ముడి స్వామి, మేకల మహేశ్వరి, బట్టెంకి రాజు, బట్ట శంకర్, బట్ట రాజు, మేకల రాజు, కంఠం సిద్ధారములు, కొంగల భూమేష్, దేవోళ్ల శ్రీకాంత్, శేఖర్, స్వామి, బదనపల్లి సంతోష్‌తో పాటు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


