ధమ్మ యాత్రకు మద్దతు పై మంత్రికు బౌద్ధ ప్రతినిధుల కృతజ్ఞతలు
నమస్తే ఇందూర్, 02.04.2026వివేక్ వెంకట స్వామి 
గురువారం తెలంగాణ సచివాలయంలో కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారిని దక్షిణ కొరియా బౌద్ధ కౌన్సిల్ ప్రతినిధి బృందం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది.రాష్ట్రంలో బౌద్ధ విలువలు మరియు గౌతమ బుద్ధుని బోధనలను విస్తరించేందుకు మంత్రి అందిస్తున్న నిరంతర మద్దతుకు ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల నిర్వహించిన ‘ధమ్మ యాత్ర’కు ఆయన అందించిన ప్రోత్సాహాన్ని ప్రశంసించారు.కర్ణాటకలోని కలబుర్గి నుంచి ప్రారంభమైన ఈ ధమ్మ యాత్ర, నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో ముగిసి, ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక యాత్రగా నిలిచిందని తెలిపారు.ప్రసిద్ధ నటుడు గగన్ మాలిక్ నాయకత్వంలో వచ్చిన ఈ ప్రతినిధి బృందంలో ఇంటర్నేషనల్ ఇంటర్‌చేంజ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (IIDA) అధ్యక్షుడు యోంగ్‌జో మున్, జనరల్ మేనేజర్ గ్యుహ్వా కాంగ్, ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్ సుజియాంగ్ మున్, కాస్మెటిక్స్ సీఈఓ కియుం మీ హాన్, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ మి క్యుంగ్ పార్క్, సెక్రటరీ వోన్ సియోప్ కిమ్ తదితరులు పాల్గొన్నారు.
