ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా ఈరోజు 11వ వార్డు లో సమావేశం ఏర్పాటు చేసి వార్డు అభివృద్ధి సమస్యలు తెలుసుకున్న కౌన్సిలర్ గూడెం కల్పన నాగరాజు*
సమావేశంలో పాల్గొన్న మాజీ చైర్మన్ గూడెం మల్లయ్య
సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందుర్ / ఏప్రిల్ 2
జోగిపేట మున్సిపాలిటీలోని 11వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా 99 రోజుల ప్రణాళికలో ఈరోజు 11వ వార్డులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వార్డు సమస్యలు చర్చించడం జరిగింది కౌన్సిలర్ గూడెం కల్పన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు రైతు భరోసా అలాగే వార్డులో మురికి కాలువలు నూతన సిసి రోడ్లు బోర్లు వాటర్ పైప్ లైన్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వార్డ్ ప్రజలకు తెలిపారు ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ గూడెం కల్పన నాగరాజు అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ పాండు 11వ వార్డు లైన్మెన్ గోపాల్ వార్డ్ ఆఫీసర్ అంజయ్య మున్సిపల్ ఆఫీసర్ సబిత వార్డు ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
