Friday, August 28, 2026
Homeతెలంగాణవివాదాస్పద భూములను క్షేత్రస్థాయిలో తహసిల్దార్ తనిఖీ

వివాదాస్పద భూములను క్షేత్రస్థాయిలో తహసిల్దార్ తనిఖీ

📰 Generate e-Paper Clip

వివాదాస్పద భూములను క్షేత్రస్థాయిలో తహశీల్దార్ తనిఖీ – కలెక్టర్‌కు నివేదిక సిద్ధం

నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జులై 28

దమ్మపేట మండల కేంద్రంలోని సర్వే నంబర్ 273/1లో కొనసాగుతున్న భూ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహశీల్దార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళి మంగళవారం రెవెన్యూ అధికారులతో కలిసి నేరుగా వివాదాస్పద భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూమి సరిహద్దులు, సాగు పరిస్థితులు, యాజమాన్య హక్కులకు సంబంధించిన అంశాలను స్వయంగా పరిశీలిస్తూ సంబంధిత రైతుల నుంచి వివరాలు సేకరించారు.పరిశీలన సందర్భంగా గట్ల సర్వేశ్వరరావు, మళ్ళా కమల, జంగాల వెంకటేశ్వరరావు, గోళ్ళ వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ, తాము దశాబ్దాలుగా ఈ భూమిలో సాగు చేస్తున్నామని తెలిపారు. తమ వద్ద ఉన్న పట్టాదారు పాస్‌బుక్స్, ఇతర యాజమాన్య హక్కుల పత్రాలు, ఆధారాలను రెవెన్యూ అధికారులకు సమర్పించారు.రైతులతో మాట్లాడిన తహశీల్దార్ మద్దినేని మురళి, ఇరువర్గాల రికార్డులను పూర్తిగా పరిశీలించి, నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించిన అనంతరం సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.ఈ పరిశీలనలో గ్రామస్తులు చిన్నశెట్టి యుగంధర్, చిట్టిబాబు, సత్యనారాయణ, మళ్ళా చిన్నా, గోళ్ళ భవాని కృష్ణ యాదవ్, కొయ్యల ప్రసాద్ పాల్గొన్నారు. రెవెన్యూ సిబ్బందిలో ఆర్‌ఐ బిక్షమయ్య, జీపీఓ కుంజా పాపయ్య తదితరులు హాజరయ్యారు.భూ వివాదంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టడంతో, ఈ వ్యవహారంలో త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్న నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!