Friday, August 28, 2026
Homeజాతియంత్రివర్ణ కాంతుల్లో ముస్తాబైన కామారెడ్డి కలెక్టరేట్..

త్రివర్ణ కాంతుల్లో ముస్తాబైన కామారెడ్డి కలెక్టరేట్..

📰 Generate e-Paper Clip

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 14:

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనం త్రివర్ణ కాంతులతో ముస్తాబైంది. ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కలెక్టరేట్ భవనాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల విద్యుత్ కాంతులతో కలెక్టరేట్ భవనం రాత్రివేళ దగదగలాడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశ జాతీయ జెండాను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన మువ్వన్నెల లైటింగ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోతున్న కలెక్టరేట్ భవనం దేశభక్తి భావాన్ని చాటుతూ ప్రజలను ఆకర్షిస్తోంది. కలెక్టరేట్‌ వైపు నుంచి వెళ్లే ప్రజలు భవనం అందాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు నుంచే కామారెడ్డి కలెక్టరేట్ త్రివర్ణ శోభను సంతరించుకోవడం విశేషంగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!