(నమస్తే ఇందూర్) కామారెడ్డి, ప్రతినిధి ఆగస్టు 15:
జిల్లా ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణ కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సమీర్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు గుండా నవీన్, జిల్లా ముఖ్య సలహాదారులు రాజు, సంగమేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్, కోశాధికారి రాజు, కుటుంబ భరోసా ఇన్చార్జి శ్రావణ్ కుమార్, సహాయ కార్యదర్శి పందిరి శ్రీనివాస్, శ్రీహరి కలర్ ల్యాబ్ యజమాని రమేష్, పట్టణ అధ్యక్షుడు బాలరాజు, శ్రీధర్, కోటేష్, సంతోష్ రెడ్డి, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేస్తామని తెలిపారు. సభ్యుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల కోసం ఫోటో భవన్ సాధించడం తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సభ్యుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని సంఘం ప్రతినిధులు తెలిపారు.


