Saturday, August 29, 2026
Homeఎడిటోరియల్ఆహ్వాన పత్రిక ఇచ్చి అరెస్టు చేయడం సిగ్గుచేటు........ బిజెపి నాయకులు ధ్వజం

ఆహ్వాన పత్రిక ఇచ్చి అరెస్టు చేయడం సిగ్గుచేటు…….. బిజెపి నాయకులు ధ్వజం

📰 Generate e-Paper Clip

ఆహ్వాన పత్రిక ఇచ్చి అరెస్టు చేయడం సిగ్గుచేటు…….. బిజెపి నాయకులు ధ్వజం

నమస్తే ఇందూర్బి/చ్కుంద, ఆగస్టు, (16)

జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు కూతురు పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చి అరెస్టు చేయడం సిగ్గుచేటని బిజెపి మండల పార్టీ అధ్యక్షులు శెట్టిపల్లి విష్ణు ధ్వజమెత్తారు. ఈరోజు ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కూతురు వివాహ మహోత్సవం కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా ముందస్తుగా బిజెపి నాయకులకు పోలీసులు అరెస్టు చేశారు. దీనిని నిరసిస్తూ బిజెపి మండల అధ్యక్షులు శెట్టిపల్లి విష్ణు మాట్లాడుతూ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పార్టీలకతీతంగా మా కూతురి వివాహ మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికలు ఇచ్చి అరెస్టు చేయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. శుభకార్యానికి వచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకునేంత కిందికి దిగజారిలేదని బిజెపి నాయకులు అన్నారు. అంతా భయం ఉన్నోడివి ఎందుకు మరి బిజెపి నాయకులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ అరెస్టు కార్యక్రమంలో గంగరాజు, కమ్మరి గంగాధర్, ధనుర్ విట్టల్, రాజు తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!