Friday, August 28, 2026
Homeస్పోర్ట్స్సివిల్ సర్వీసెస్ క్రీడా ఎంపికలకు దరఖాస్తుల ఆహ్వానం..

సివిల్ సర్వీసెస్ క్రీడా ఎంపికలకు దరఖాస్తుల ఆహ్వానం..

📰 Generate e-Paper Clip

-19 క్రీడాంశాల్లో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 20:

కామారెడ్డి జిల్లా 2026–27 సంవత్సరానికి అఖిల భారత సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 19 క్రీడాంశాల్లో ఈ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారమ్స్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, పవర్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్ ఫిజిక్, యోగా, ఖో-ఖో క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీలు సెప్టెంబర్ 3, 2026న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న కామారెడ్డి జిల్లాకు చెందిన సివిల్ సర్వీసెస్ ఉద్యోగ క్రీడాకారులు ఆగస్టు 31న ఉదయం 10:30 గంటలకు కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని రూమ్ నంబర్ 223లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.ఎంపికైన క్రీడాకారులకు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియం, జింఖానా గ్రౌండ్స్ తదితర వేదికల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు.
మరిన్ని వివరాల కోసం కామారెడ్డి జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా యువజన, క్రీడల అధికారి (ఎఫ్.ఏ.సి.) రంగ వెంకటేశ్వర్ గౌడ్ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!