-19 క్రీడాంశాల్లో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 20:
కామారెడ్డి జిల్లా 2026–27 సంవత్సరానికి అఖిల భారత సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 19 క్రీడాంశాల్లో ఈ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారమ్స్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, పవర్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్ ఫిజిక్, యోగా, ఖో-ఖో క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీలు సెప్టెంబర్ 3, 2026న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న కామారెడ్డి జిల్లాకు చెందిన సివిల్ సర్వీసెస్ ఉద్యోగ క్రీడాకారులు ఆగస్టు 31న ఉదయం 10:30 గంటలకు కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని రూమ్ నంబర్ 223లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులకు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియం, జింఖానా గ్రౌండ్స్ తదితర వేదికల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు.మరిన్ని వివరాల కోసం కామారెడ్డి జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా యువజన, క్రీడల అధికారి (ఎఫ్.ఏ.సి.) రంగ వెంకటేశ్వర్ గౌడ్ సూచించారు.


