Saturday, August 29, 2026
Homeరాజకీయంకేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు..

📰 Generate e-Paper Clip

(నమస్తే ఇందూర్) హైదరాబాద్ డెస్క్ ఆగస్టు 22:

హైదరాబాద్ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీ జి. కిషన్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు స్థానిక అంశాలతో పాటు రాజకీయ, అభివృద్ధి విషయాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు సీహెచ్. సాయిబాబా, బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చర్ల శ్రీకాంత్, కాంటెస్ట్ సర్పంచ్ జువ్వాడి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఆత్మీయంగా సమావేశమై తమ ప్రాంతానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.అలాగే గ్రామస్థాయి నుంచి బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై చర్చించినట్లు నాయకులు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!