-ఆగస్టు 23న పోచంపాడులో రెవెన్యూ కాంక్లేవ్
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఆగస్టు 22:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ పరిధిలోని రెవెన్యూ ఉద్యోగులు ఆగస్టు 23న నిజామాబాద్ జిల్లా పోచంపాడులో నిర్వహించనున్న రెవెన్యూ కాంక్లేవ్‌కు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పాలన అధికారుల సంఘం పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా బాన్సువాడ డివిజన్ గ్రామ పాలనాధికారుల సంఘం అధ్యక్షులు దాసరి సాయిలు మాట్లాడుతూ, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు, విధులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ కాంక్లేవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలోని రెవెన్యూ ఉద్యోగులందరూ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు లచ్చిరెడ్డి అధ్యక్షతన ఈ రెవెన్యూ కాంక్లేవ్ జరగనుంది. ఉద్యోగుల సమస్యలు, పరిపాలనకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కిషోర్, ఉపాధ్యక్షులు సత్యం, శ్రీనివాస్, కోశాధికారి కపిల్‌తో పాటు పలువురు జీపీఓలు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొని కాంక్లేవ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


