ePaper
Tuesday, April 14, 2026
📄 ePaper
Homeతెలంగాణరాజ్యసభలో బీఆర్‌ఎస్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రాజ్యసభలో బీఆర్‌ఎస్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

📰 Generate e-Paper Clip

రాజ్యసభలో బీఆర్‌ఎస్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నమస్తే ఇందూర్, డెస్క్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్ట్‌ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందన్నారు. కాలేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగాయన్నారు. కాలేశ్వరం వల్ల ఉగయోగం లేదని నివేదికలు చెప్పాయని తెలిపారు. కాళేశ్వరం ప్రజల డబ్బుతో కట్టారా? లేక కేసీఆర్‌ సొంత డబ్బుతో కట్టారా అంటూ ప్రశ్నించారు. రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి నిధులు తీసుకొని కాలేశ్వరం నిర్మించారని కేంద్ర మంత్రి తెలిపారు. భద్రాచలంలో ఉన్న గ్రామాలు ఏపీ పునర్విభజన చట్టంలో చేర్చారని… అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఎన్నికల ముందు కాలేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ జరిపి కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. మాజీ సీఎంపై ఎందుకు విచారణ జరపలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిలదీశారు.. KP

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!