(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
ఆగస్టు 15:
కామారెడ్డి పట్టణంలోని 16వ వార్డులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యాడారం సంతోష్, విజయ్, నందు, రాహుల్, లక్ష్మీరాజ్యం, రాధాకిషన్, నీలేందర్ రెడ్డి, నర్సింహారెడ్డి, గంగారెడ్డి, శోభన్, అజయ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.


