అంతంపల్లిలో ఘనంగా మాస్ ప్లాంటేషన్ కార్యక్రమం
నమస్తే ఇందూర్, బిక్కనూర్/
అంతంపల్లి: గ్రామంలో మాస్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పదకొండ మంజుల సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ గోల్కొండ శ్రీనివాస్ రెడ్డి, వి.డి.సి. అధ్యక్షులు గంగారెడ్డి, వార్డు సభ్యులు సురేందర్ రెడ్డి, బాబు, టీఏ రాజు, ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్, గ్రామ కార్యదర్శి భార్గవితో పాటు గ్రామ ప్రజలు పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షిస్తూ పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధిలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.


