Friday, August 28, 2026
Homeఎడిటోరియల్కన్నాపూర్‌లో ఘనంగా మెగా వనమహోత్సవం

కన్నాపూర్‌లో ఘనంగా మెగా వనమహోత్సవం

📰 Generate e-Paper Clip

కన్నాపూర్‌లో ఘనంగా మెగా వనమహోత్సవం

నమస్తే ఇందూర్/కామారెడ్డి జిల్లా

కన్నాపూర్: గ్రామంలో మెగా వనమహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామ పరిసరాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పాలకమండలి సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని వారు తెలిపారు.వనమహోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నాటిన మొక్కలను నిరంతరం సంరక్షించి వాటి ఎదుగుదలకు కృషి చేస్తామని గ్రామస్తులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!