Sunday, August 30, 2026
Homeరాజకీయంఎర్రపహాడ్‌లో ఘనంగా కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..

ఎర్రపహాడ్‌లో ఘనంగా కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..

📰 Generate e-Paper Clip

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా
తాడ్వాయి ఆగస్టు 14:

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్ గ్రామంలో పేద కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మార్గదర్శకంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 7 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ. ఆడపిల్లల వివాహం పేద కుటుంబాలకు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందన్నారు. పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సొంటికే మల్లవ్వ, కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులు ఆరాలి కిషన్ రావు, ప్రభాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, జెలేందర్ రెడ్డి, టి. మోహన్ రెడ్డి, మోహన్ గౌడ్, బీరయ్య, సిహెచ్. సాయిలు, సంజీవరెడ్డి, తిరుపతి రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గైని రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!