తాడ్వాయిలో పీడీఎస్ బియ్యం పట్టివేత..
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా తాడ్వాయి ఆగస్టు 18:
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పీడీఎస్ బియ్యం పట్టుబడింది. సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తాడ్వాయి పోలీస్ స్టేషన్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా, గోల్డ్ కలర్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారును అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేశారు.కారులో పీడీఎస్ బియ్యం సంచులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనంలో ఉన్న వ్యక్తిని సంగన్న భాస్కర్ గౌడ్‌గా గుర్తించారు. అనంతరం పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి, కారుతో పాటు పీడీఎస్ బియ్యం సంచులను తాడ్వాయి పోలీస్ స్టేషన్‌కు తరలించి భద్రపరిచారు. ఈ విషయమై సివిల్ సప్లయ్ డీటీ తిరుపతికి సమాచారం అందించగా, పంచనామా ఆధారంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన బియ్యం పరిమాణం, వాహన యాజమాన్యం, పీడీఎస్ బియ్యం ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు తదితర అంశాలపై పోలీసులు, సంబంధిత అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.


