నాగ్లూర్ గ్రామంలో ఘనంగా వన మహోత్సవం
నమస్తే ఇందూర్/గాంధారి
నాగ్లూర్: నాగ్లూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామ పరిసరాల్లో మొక్కలు నాటి, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోత్ సంతోష్ నాయక్, ఉప సర్పంచ్ దడెగె చక్రపాణి గౌడ్, గోతి బావుసింగ్, మంజ జగన్ సింగ్ తదితరులు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి, దానిని తమ బిడ్డలా సంరక్షించాలని సూచించారు. పచ్చదనం పెరిగితేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ‘చెట్టును నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం’ అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయికుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాల్ రాజ్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


