Friday, August 28, 2026
Homeరాజకీయంవన మహోత్సవంలో భాగంగా కామారెడ్డి పీఏసీఎస్‌ ఆవరణలో మొక్కలు నాటిన అధికారులు

వన మహోత్సవంలో భాగంగా కామారెడ్డి పీఏసీఎస్‌ ఆవరణలో మొక్కలు నాటిన అధికారులు

📰 Generate e-Paper Clip

(నమస్తే ఇందూర్) కామారెడ్డి, ప్రతినిధి ఆగస్టు 25:

వన మహోత్సవం పురస్కరించుకొని మంగళవారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్‌) కామారెడ్డి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘ ఆవరణలో పలువురు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పెద్ద పోతన్న, గారి రాజేష్, ఆనంద్ రావు, హనుమండ్ల రాజు, నర్సింహారెడ్డి, మామిండ్ల హనుమండ్లు, రమేష్, సతీష్, వినోద్, శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!