(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా
లింగంపేట్ ఆగస్ట్ 18:
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది వివరాల్లో కి వెళితే భార్యాభర్తల మధ్య జరిగిన కుటుంబ కలహం నేపథ్యంలో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శెట్టిపల్లి, సంగారెడ్డి ప్రాంతానికి చెందిన మౌనిక (30)కు భర్త బహుగుణ చారితో గొడవ జరిగింది. దీంతో మౌనిక తన తల్లి ఇంటికి ముస్తాపూర్‌కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భర్త. భార్యను తిరిగి తన ఇంటికి శెట్టిపల్లికి తీసుకెళ్తానని చెప్పి ముస్తాపూర్‌కు వచ్చాడు.రాత్రి సమయంలో ఇద్దరూ నిద్రిస్తున్న సమయంలో భార్యపై భర్త చాకుతో రెండు, మూడు చోట్ల దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన మౌనికను కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.ఈ ఘటనపై లింగంపేట్ పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.


