Saturday, August 29, 2026
Homeఆరోగ్యంరేపు యశోద హాస్పిటల్ ఉచిత క్యాంపు వైద్య సేవలు..

రేపు యశోద హాస్పిటల్ ఉచిత క్యాంపు వైద్య సేవలు..

📰 Generate e-Paper Clip

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
ఆగస్టు 20:

ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉచిత క్యాంపు ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. కామారెడ్డి జర్నలిస్ట్స్ ఫోరం సహకారంతో ఈ నెల 21వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరం కొనసాగనుంది.కామారెడ్డిలోని విజ్ఞాన భారతి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పక్కన క్యాంపు శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరంలో గుండె సంబంధిత సమస్యలు, ఎముకలు–కీళ్ల సమస్యలు, సాధారణ ఆరోగ్య సమస్యలపై నిపుణులైన వైద్యులు సలహాలు, సూచనలు అందించనున్నారు.అదేవిధంగా బీపీ, జీఆర్‌బీఎస్, బరువు, ఎస్‌పీఓ₂, పల్స్ రేట్, ఈసీజీ, బోన్ మినరల్ డెన్సిటీ (బీఎండీ) తదితర ఆరోగ్య పరీక్షలను అవసరాన్ని బట్టి వైద్యుల సూచన మేరకు క్యాంపు నిర్వహించనున్నారు. యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్‌కు చెందిన డా. లక్ష్మణ శాస్త్రి జి., జనరల్, లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జన్, కొలొప్రొక్టాలజిస్ట్ శిబిరంలో వైద్య సేవలు అందించనున్నారు. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్‌లో కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ తదితర విభాగాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా ప్రజలు ఈ ఉచిత క్యాంపు శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిర్వాహకులు కోరారు. శిబిరానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 94940 53917, 90634 73167 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!