Sunday, July 19, 2026
Homeతెలంగాణరాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో కామారెడ్డి పోలీసుల సత్తా

రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో కామారెడ్డి పోలీసుల సత్తా

📰 Generate e-Paper Clip

-6 పతకాలతో మెరిసిన జిల్లా పోలీసు

-క్రీడాకారులు విజేతలను సన్మానించిన ఎస్పీ రాజేష్ చంద్ర

(నమస్తే ఇందూర్) కామారెడ్డి, ప్రతినిధి జూలై 18:

హైదరాబాద్ మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో జూలై 7 నుంచి 9 వరకు నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మొత్తం ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలతో 6 పతకాలు సాధించారు. ఈ విజయంతో జిల్లా పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది విధి నిర్వహణలోనే కాకుండా క్రీడల్లోనూ ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, ఇవి పోలీసు విధుల్లో మరింత సమర్థతకు దోహదపడతాయని పేర్కొన్నారు.
జిల్లా పోలీసు శాఖలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, సిబ్బంది రాష్ట్ర స్థాయిలో సాధించిన విజయాలను జాతీయ స్థాయిలోనూ కొనసాగించాలని సూచించారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చి తెలంగాణ పోలీసు శాఖకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఏఆర్ డీఎస్పీ ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో జిల్లా నుంచి వివిధ క్రీడల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది విశేష ప్రతిభ కనబరిచారు. పతక విజేతలు ఎన్. ఉత్తేజ్ (పీసీ), కామారెడ్డి పోలీస్ స్టేషన్ – వుషూ (80 కేజీలు)లో స్వర్ణ పతకం, బాక్సింగ్ (80 కేజీలు)లో రజత పతకం పి. బాలరాజు (పీసీ), నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ – రెజ్లింగ్ (ఫ్రీ స్టైల్, 97 కేజీలు)లో రజత పతకం
జె. అంకోష్ (పీసీ), డీఏఆర్ కామారెడ్డి – రెజ్లింగ్ (గ్రెకో రోమన్, 87 కేజీలు)లో కాంస్య పతకం ఎన్. ప్రభు (పీసీ), డీఏఆర్ కామారెడ్డి – రెజ్లింగ్ (గ్రెకో రోమన్, 97 కేజీలు)లో కాంస్య పతకం చి. వినయ్ రెడ్డి (పీసీ), ఎస్‌ఎస్ నగర్ పోలీస్ స్టేషన్ – కరాటే (60 కేజీలు)లో కాంస్య పతకం ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, పతక విజేతలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విజేతలు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి కామారెడ్డి జిల్లా, తెలంగాణ పోలీసు శాఖకు మరింత పేరు తీసుకురావాలని ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!