Wednesday, September 2, 2026
Homeతెలంగాణలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

📰 Generate e-Paper Clip

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 01:

లయన్స్ క్లబ్ కొంపల్లి లైఫ్ స్పేసెస్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి, దత్త బస్తీల్లో నిర్వహిస్తున్న సంస్కార కేంద్రాల విద్యార్థులకు శనివారం నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ చీల రాము మాట్లాడుతూ, శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హై స్కూల్ ఆధ్వర్యంలో బస్తీల్లోని చిన్నారులకు ఉచితంగా విద్యతో పాటు సంస్కారం, సదాచారం, క్రమశిక్షణను అందించే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య అందించడం గొప్ప సేవ అని కొనియాడారు.పాఠశాల ప్రిన్సిపాల్ నాగేష్ మాట్లాడుతూ, నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసి, విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!