(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
ఆగస్టు 19:
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్ సెంటర్లో డాక్టర్ విక్రమ్ గౌడ్ బైరే విలేకరుల సమావేశంలో బుధవారం మాట్లాడుతూ. మోకాళ్ల నొప్పితో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వడ్లూర్‌కు చెందిన పెంటాగౌడ్‌కు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స జరిగి నెల రోజులు పూర్తికాగా, ప్రస్తుతం ఎలాంటి సహాయం లేకుండా నడవడంతో పాటు తన రోజువారీ పనులను తానే చేసుకుంటున్నట్లు పెంటాగౌడ్ తెలిపారు. పెంటాగౌడ్ మాట్లాడుతూ. గత 5,6. సంవత్సరాలుగా మోకాళ్ల సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. మోకాళ్లలో ఎముకలు అరిగిపోయి నడవడం కూడా కష్టంగా మారిందన్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో డాక్టర్ విక్రమ్ గౌడ్ బైరే ఆధ్వర్యంలో రోబోటిక్ సర్జరీ చేయించుకున్నానని, ప్రస్తుతం నడవడంతో పాటు బయటకు కూడా తిరుగుతున్నానని తెలిపారు.రోబోటిక్ సర్జరీతో వేగంగా కోలుకునే అవకాశం యశోద సికింద్రాబాద్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ నిపుణుడు డాక్టర్ విక్రమ్ గౌడ్ బైరె మాట్లాడుతూ.. పెంటాగౌడ్ తనను సంప్రదించినప్పుడు మోకాలి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఎక్స్‌రే పరిశీలించగా మోకాలు పూర్తిగా అరిగిపోయి, వంకరగా మారినట్లు గుర్తించామని తెలిపారు.
రోబోటిక్ విధానంలో చిన్న ఇన్సిషన్‌తో, కండరాలకు తక్కువ నష్టం కలిగేలా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయవచ్చని వివరించారు. ఈ విధానంలో శస్త్రచికిత్స చేసిన రోజే సాయంత్రం నుంచి రోగిని నడిపించే అవకాశం ఉంటుందని తెలిపారు. సాధారణంగా రెండు రోజుల పాటు నడకకు సంబంధించిన శిక్షణ ఇచ్చిన అనంతరం ఇంటికి పంపిస్తామని, సుమారు రెండు వారాల్లో మెట్లు ఎక్కడం, దిగడం వంటి పనులను సైతం స్వయంగా చేసుకునే స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు.రోబోటిక్ సర్జరీలో చిన్న ఇన్సిషన్, తక్కువ రక్తస్రావం, మోకాలి అమరికలో ఎక్కువ ఖచ్చితత్వం, ఇంప్లాంట్‌ను సరైన స్థానంలో అమర్చే అవకాశం వంటి ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్ విక్రమ్ తెలిపారు. దీనివల్ల రోగికి సహజమైన జాయింట్ ఫీలింగ్ కలుగుతుందని పేర్కొన్నారు.
కాంప్లెక్స్ ఫ్రాక్చర్లకు ఆధునిక చికిత్స
జాయింట్ రీప్లేస్‌మెంట్‌తో పాటు క్లిష్టమైన ఫ్రాక్చర్లకు కూడా ఆధునిక చికిత్స అందిస్తున్నామని డాక్టర్ విక్రమ్ గౌడ్ బైరే తెలిపారు. ఇటీవల 22 ఏళ్ల యువకుడు బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, కాలికి రక్త సరఫరా నిలిచిపోయిన పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చాడని చెప్పారు. వాస్కులర్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ సహకారంతో రక్తనాళాల మరమ్మతు, చర్మం, ఎముకకు చికిత్స అందించామని తెలిపారు. ప్రస్తుతం ఆ యువకుడు కాలు తొలగించాల్సిన అవసరం లేకుండాకోలుకుంటున్నాడని వివరించారు. యువతలోనూ మోకాళ్ల నొప్పులు ప్రస్తుతం చిన్న వయసు వారిలో కూడా మోకాళ్ల నొప్పులు పెరుగుతున్నాయని డాక్టర్ విక్రమ్ తెలిపారు. ముఖ్యంగా విటమిన్-డి లోపం, శారీరక వ్యాయామం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటన్నారు. ప్రతిరోజూ వచ్చే రోగుల్లో పిల్లలు, యువత, ఐటీ ఉద్యోగులు కూడా అధిక సంఖ్యలో ఉంటున్నారని చెప్పారు.ఎండలో తగినంత సమయం గడపకపోవడం వల్ల విటమిన్-డి లోపం ఏర్పడుతుందని, దాంతో కాండ్రోమలేసియా పటేల్లా సమస్య వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితిలో మోకాలి చిప్ప వెనుక భాగం బలహీనపడటం వల్ల కూర్చుని లేచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి వస్తుందని తెలిపారు. విటమిన్-డి లోపాన్ని సరిచేసుకోవడంతో పాటు తగిన వ్యాయామం చేస్తే చాలా వరకు సమస్య తగ్గుతుందని చెప్పారు.మోకాలి అరుగుదలలో దశలవారీ చికిత్స మోకాలి అరుగుదలకు నాలుగు దశలు ఉంటాయని డాక్టర్ విక్రమ్ వివరించారు. నాలుగో దశలో మోకాలి గుజ్జు పూర్తిగా అరిగిపోయినప్పుడు మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అవసరం కావచ్చన్నారు. అయితే రెండో, మూడో దశల్లో జెల్ ఇంజెక్షన్ల ద్వారా కొంతకాలం నొప్పిని నియంత్రించవచ్చని తెలిపారు.రోబోటిక్ సర్జరీకి రూ.4 లక్షలకు పైగా ఖర్చు రోబోటిక్ సర్జరీలో అత్యాధునిక పరికరాలు, ఇంప్లాంట్లు ఉపయోగించడం వల్ల ఖర్చు కొంత ఎక్కువగా ఉంటుందని డాక్టర్ విక్రమ్ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రోగులకు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి భారం తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయితే ఈ రోబోటిక్ సర్జరీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని తెలిపారు.
రూమ్ కేటగిరీని బట్టి ప్యాకేజీలు మారుతాయని, సింగిల్ రూమ్‌లో సుమారు రూ.4 లక్షల నుంచి రూ.4.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇందులో సర్జన్ ఫీజు, ఆపరేషన్ థియేటర్, ఇంప్లాంట్ తదితర ఖర్చులు ఉంటాయని చెప్పారు. జనరల్ వార్డులో ఈ మొత్తంతో పోలిస్తే సుమారు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు తక్కువగా ఉండవచ్చన్నారు. సాధారణంగా రోగి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని వివరించారు.5 వేలకుపైగా రోబోటిక్ సర్జరీలు ఇప్పటివరకు తాను 5,000కుపైగా రోబోటిక్ సర్జరీలు, దాదాపు 10,000కుపైగా నాన్-రోబోటిక్ సర్జరీలు నిర్వహించినట్లు డాక్టర్ విక్రమ్ గౌడ్ బైరె తెలిపారు. అధునాతన రోబోటిక్ విధానంతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అనంతరం రోగులు వేగంగా సాధారణ జీవనశైలికి చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.నడవలేకపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, రోజువారీ పనులు చేసుకోలేకపోవడం వంటి సమస్యలతో జీవనశైలి దెబ్బతిన్న వారికి తగిన చికిత్స ద్వారా మళ్లీ సాధారణ స్థితికి చేరుకుని నొప్పి లేని జీవితం గడపవచ్చని డాక్టర్ విక్రమ్ పేర్కొన్నారు.


