Friday, August 28, 2026
Homeరాజకీయంరాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు..

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు..

📰 Generate e-Paper Clip

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
ఆగస్టు 20:

భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించడంలో, యువతకు నూతన అవకాశాలు కల్పించడంలో, దేశ అభివృద్ధికి పునాది వేయడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.రాజీవ్ గాంధీ ఆశయాలు, దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలన్న ఆయన ఆలోచనలు నేటికీ ప్రాధాన్యత కలిగి ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు గడ్డమీది మహేష్, కామారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు మెహర్ బాబా గౌడ్, టౌన్ అధ్యక్షుడు సుదర్శన్, డీసీసీ ఉపాధ్యక్షుడు పంపరి లక్ష్మణ్, డీసీసీ జనరల్ సెక్రటరీ నిమ్మ విజయకుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, చాట్ల వంశీ, జమీల్, రంగ రమేష్ గౌడ్, సాయి బాబు, సేవాదళ్ జిల్లా యూత్ అధ్యక్షుడు నర్సల్లా మహేష్, ఆబిద్, నిరంజన్, ఇమరోజ్, శశి, రాహుల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!