(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా పాల్వంచ ఆగస్టు 22:
రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ తనయులు మహమ్మద్ ఇలియాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ పాల్గొని ఇలియాస్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇలియాస్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలియాస్ ప్రజల కోసం, ప్రజల మధ్య నిరంతరం సేవలందిస్తూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో ఆయన మరింత ముందుకు సాగాలని పల్లె రమేష్ గౌడ్ అభిలషించారు.అనంతరం ప్రభుత్వ సలహాదారు శ్రీ మహమ్మద్ షబ్బీర్ అలీని కూడా పల్లె రమేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల పాల్వంచ మండల అభివృద్ధి కోసం రూ.28 కోట్ల నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, మండల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో పాల్వంచ మండలంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని ఆయన పేర్కొన్నారు.


