6 పెండింగ్ డీఏలు.. 2వ పీఆర్సీ అమలు చేయాలి
కామారెడ్డి కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో TNGO ఆధ్వర్యంలో ఆందోళన
నమస్తే ఇందూర్,కామారెడ్డి ప్రతినిధి
కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన 6 పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని, 2వ పే రివిజన్ కమిషన్ (PRC)ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ TNGO ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ధర్నా చౌక్‌లో ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగులకు రావాల్సిన డీఏలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే 2వ పీఆర్సీ అమలులో జాప్యం చేయకుండా ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేసి ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కల్పించాలని నాయకులు కోరారు. పీఆర్సీ అమలుపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని అన్నారు.ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని TNGO నాయకులు హెచ్చరించారు. ధర్నాలో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉద్యోగ సంఘాలు 6 పెండింగ్ డీఏలు, 2వ పీఆర్సీ అమలు తదితర డిమాండ్లపై ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కామారెడ్డిలోనూ ఈ నిరసన చేపట్టారు.


