Wednesday, September 2, 2026
Homeతెలంగాణహైదరాబాద్అద్భుత ప్రదర్శనకు బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అవార్డు

అద్భుత ప్రదర్శనకు బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అవార్డు

📰 Generate e-Paper Clip

పాల్వంచ బాలుడి అద్భుత ప్రతిభ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో అబ్దుల్ నుమాన్‌కు రెండు స్వర్ణ పతకాలు

నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆగస్టు 30 న

అద్భుత ప్రదర్శనకు “బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు”

పాల్వంచ, ఆగస్టు 30:

హైదరాబాద్‌లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ టూ స్పోర్ట్స్ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ , కుంగు.పూ , కరాటే & టైక్వాండో పియన్షిప్ –2026లో పాల్వంచకు చెందిన బాల క్రీడాకారుడు అబ్దుల్ నుమాన్ అద్భుత ప్రతిభ కనబరిచాడు.

నవోదయ కరాటే ఇన్స్టిట్యూట్, పాల్వంచకు చెందిన అబ్దుల్ నుమాన్ మాస్టర్ రాంబాబు గారి శిక్షణలో ఈ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.

ఈ పోటీల్లో కటా మరియు వెపన్ కటా విభాగాల్లో పోటీపడి అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రెండు స్వర్ణ పతకాలను సాధించాడు. అంతేకాకుండా పోటీల్లో అబ్దుల్ నుమాన్ కనబరిచిన అద్భుతమైన ప్రదర్శనను గుర్తించిన నిర్వాహకులు అతనికి “బెస్ట్పె ర్ఫార్మన్స్అ వార్డు ”ను కూడా అందజేశారు.

చిన్న వయసులోనే అంతర్జాతీయ వేదికపై రెండు స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు అందుకోవడం పట్ల నవోదయ కరాటే ఇన్స్టిట్యూట్ మాస్టర్ రాంబాబు, తల్లిదండ్రులు మరియు పాల్వంచ క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

అబ్దుల్ నుమాన్ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పాల్వంచకు, తెలంగాణకు మరియు దేశానికి మరింత పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

అబ్దుల్ నుమాన్ విజయాలు

గోల్డ్మె డల్ – కాట

గోల్డ్మె డల్ – వెపన్ కాట

బెస్ట్పె ర్ఫార్మన్స్అ వార్డు

శిక్షణ: మాస్టర్ రాంబాబు

నవోదయ కరాటే ఇన్స్టిట్యూట్, పాల్వంచ

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!