(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జూలై 18:
కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని జీఎన్ఆర్ గార్డెన్‌లో శనివారం నిర్వహించిన ఆర్.ఎం.పి & పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య నాయకుల సమావేశంలో కామారెడ్డి డివిజన్ జిల్లా అధ్యక్షుడిగా ప్రముఖ పి.ఎం.పి వైద్యులు షేక్ అజీజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రాష్ట్ర అధ్యక్షుడు నేతి రాజేశ్వర్ రావు సమక్షంలో, కామారెడ్డి జిల్లా ఆర్.ఎం.పి& పిఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు నిజ్జన విఠల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాచారెడ్డి మండలం సోమారంపేట గ్రామానికి చెందిన షేక్ అజీజ్‌కు డివిజన్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన షేక్ అజీజ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన అసోసియేషన్ సభ్యులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ పరిధిలోని ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. అందరినీ కలుపుకొని అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు, వివిధ మండలాల ప్రతినిధులు, వైద్య మిత్రులు షేక్ అజీజ్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర
గౌరవ అధ్యక్షుడు హన్మంతరావు, హైదరాబాద్ గౌరవ అధ్యక్షుడు కంటే సాయిన్న, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మల్కాజిగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అశోక్ రాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతాల బుచ్చిరెడ్డి, దాసరి మాణిక్యం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

