Sunday, July 19, 2026
Homeక్రైమ్ న్యూస్అత్యధిక మద్యం సేవించిన ఇద్దరికీ రెండు రోజులు జైలు శిక్ష

అత్యధిక మద్యం సేవించిన ఇద్దరికీ రెండు రోజులు జైలు శిక్ష

📰 Generate e-Paper Clip

నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెంజిల్లా . జులై 18

అత్యధిక మద్యం సేవించిన ఇద్దరికీ 2 రోజులు జైలు శిక్ష కొత్తగూడెం లీగల్:: అధికంగా మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.రవికుమార్శ నివారం (18/07/2026) తీర్పు చెప్పారు. వివరాలు ఇలా. పూసగూడెం సుబ్బనపల్లి కీ చెందిన పద్దాం నవీన్ అధికంగా 250% మద్యం సేవించి పాల్వంచ రూరల్ పోలీసులకు 29/6/2026 న పెద్దమ్మ గుడి దగ్గర పట్టుబడ్డాడు పాల్వంచ రూరల్ ఎస్సై బి సురేష్ కేసు నమోదు చేసుకుని కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు.

రెండవ కేసులో కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ జి.ప్రవీణ్ కుమార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర వాహన తనకి చేయుచుండగా ఇల్లందు లక్ష్మీ నగర్ కు చెందిన బెల్లం మధు కుమార్ అధికంగా 314% మద్యం సేవించి 28/6/2026 న పట్టుబడ్డాడు. ఇద్దరు కోర్టులో నేరము ఒప్పుకున్నందున ఇద్దరికీ రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ జడ్జి. తీర్పు చెప్పారు. (పాల్వంచ రూరల్ కోర్టు డ్యూటీ ఆఫీసర్ పిసి ఏ .మోహన్ బాబు మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోర్ట్ కానిస్టేబుల్ అహ్మద్ పాషా  సహకరించారు.

నోట్ : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించేదే లేదని కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బి రవికుమార్. గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!