Friday, July 24, 2026
Homeతెలంగాణఆషాఢ మాస బోనాలకు ముస్తాబైన గ్రామదేవతల ఆలయాలు

ఆషాఢ మాస బోనాలకు ముస్తాబైన గ్రామదేవతల ఆలయాలు

📰 Generate e-Paper Clip

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జూలై 18:

ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి గ్రామం భక్తి శోభతో కళకళలాడుతోంది. గ్రామదేవతలైన పోచమ్మ ఆలయం, పెద్దమ్మ ఆలయం, పోలేరమ్మ ఆలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు, తోరణాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించి బోనాల ఉత్సవాలకు సిద్ధం చేశారు.ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు, శుభ్రత పనులు పూర్తి చేయగా, భక్తుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బోనాలు సమర్పించేందుకు మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో సిద్ధమవుతుండగా, గ్రామస్థులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆషాఢ మాసంలో గ్రామదేవతలకు బోనాలు సమర్పించడం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక సంప్రదాయం.ఈ సందర్భంగా పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ వంటి గ్రామదేవతలను భక్తిశ్రద్ధలతో పూజించి గ్రామానికి సుఖశాంతులు, పంటల సమృద్ధి, ప్రజల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థించడం ఆనవాయితీ. అన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!