Tuesday, November 3, 2026
Homeరాజకీయంరసాభాసగా మారిన కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం చర్చలు లేకుండానే వాయిదా

రసాభాసగా మారిన కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం చర్చలు లేకుండానే వాయిదా

📰 Generate e-Paper Clip

(నమస్తే ఇందూర్) కామారెడ్డి టౌన్ జూలై 23:

కామారెడ్డి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం గురువారం తీవ్ర గందరగోళం మధ్య ఎలాంటి అభివృద్ధి అంశాలపై చర్చలు జరగకుండానే వాయిదా పడింది. సమావేశం ప్రారంభానికి ముందే ఫ్లోర్ లీడర్ల సమావేశంలో శానిటైజేషన్, రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ సమస్యలపై మాత్రమే చర్చించాలని నిర్ణయించినప్పటికీ, ఎజెండాలో అన్ని బిల్లులను చేర్చడంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ, బిల్లుల ఆమోద ప్రక్రియపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలకు సంబంధించిన అత్యవసర సమస్యలైన శానిటైజేషన్, చెత్త సేకరణ ట్రాక్టర్లు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపైనే ముందుగా చర్చించాలని వారు సమావేశంలో పట్టుబట్టారు. ఈ వివాదంతో సమావేశం పలుమార్లు నిలిచిపోయింది. తొలుత 15 నిమిషాల పాటు వాయిదా వేయగా, అనంతరం భోజన విరామం పేరుతో మరింత ఆలస్యం చేశారు. చివరకు సాయంత్రం 4:40 గంటలకు సమావేశాన్ని ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ, “ప్రజాధనంలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని” స్పష్టం చేశారు. సమావేశం వాయిదా పడటంతో అభివృద్ధి పనులకు సంబంధించిన కీలక అంశాలు చర్చకు నోచుకోకపోవడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!