ముదిరాజుల BC-A డిమాండ్‌ను వెంటనే అమలు చేయాలి: తెలంగాణ ముదిరాజ్ JAC
నమస్తే ఇందూర్ హైదరాబాద్: తెలంగాణ బందూక్, ప్రజా వీరుడు పండుగ సాయన్న ఆశయాలకు, ఆలోచనలకు తాము వ్యతిరేకం కాదని, ఆయన పేరుతో జరుగుతున్న రాజకీయాలు, దౌర్జన్యాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ముదిరాజ్ JAC స్పష్టం చేసింది. ముదిరాజుల అస్తిత్వానికి ప్రతీకగా ఉన్న BC-A వర్గీకరణ డిమాండ్‌ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది.విగ్రహాలు, జయంతుల పేరుతో ముదిరాజులను మోసం చేయడం ఆపాలని JAC నాయకత్వం పేర్కొంది. పండుగ సాయన్న పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. ముదిరాజుల సామాజిక, రాజకీయ హక్కుల సాధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని కోరింది.
రవీంద్ర భారతిలో జరిగే సభ నేపథ్యంలో నిరసన
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరగనున్న సభ నేపథ్యంలో తమ నిరసనను తెలియజేస్తామని తెలంగాణ ముదిరాజ్ JAC ప్రకటించింది. తెలంగాణలోని ముదిరాజులందరూ BC-A సాధన పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. సమాజ హక్కులు, అస్తిత్వ పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరింది.ఈ సందర్భంగా JAC తన నినాదంగా “కాంగ్రెస్ హటావ్ – తెలంగాణ బచావ్” ను ప్రకటించింది.ఈ సందర్భంగా డాక్టర్ వై. శివ ముదిరాజ్ మాట్లాడుతూ.. పండుగ సాయన్న ఆశయాలు, ఆలోచనలు తమకు ఆదర్శమని, ఆయన పేరుతో జరుగుతున్న రాజకీయాలను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ముదిరాజుల సామాజిక హక్కులు, అస్తిత్వ పరిరక్షణ కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి BC-A డిమాండ్‌ను అమలు చేయాలని కోరారు. విగ్రహాలు, జయంతుల పేరుతో ముదిరాజులను మభ్యపెట్టకుండా, వారి అభివృద్ధి, హక్కుల సాధనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. పండుగ సాయన్న పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. రవీంద్ర భారతిలో జరిగే సభ నేపథ్యంలో ముదిరాజుల నిరసనను తెలియజేస్తామని, తెలంగాణలోని ముదిరాజులందరూ ఐక్యంగా BC-A సాధన పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముదిరాజుల హక్కులు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.


