(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 10:
కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డు పరిధిలో ఉన్న కాకతీయ నగర్ హనుమాన్ గుడి వద్ద పెరిగిన గడ్డి కారణంగా భక్తులు, కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వార్డు కౌన్సిలర్ హర్షితకు స్థానికులు సమస్యను తెలియజేశారు.
సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన కౌన్సిలర్ హర్షిత మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంతో వారు వెంటనే చర్యలు చేపట్టారు. బ్రష్ కట్టర్ సహాయంతో ఆలయ పరిసరాల్లో పెరిగిన గడ్డిని తొలగించి పరిశుభ్రత పనులు నిర్వహించారు.దీంతో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్గం సుగమమైంది. సమస్యను వెంటనే పరిష్కరించిన కౌన్సిలర్ హర్షితకు కాలనీవాసులు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

